శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ శుక్రవారం రాత్రి పుట్టపర్తిలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి, వారి వసతి, ఆహార, ప్రాథమిక సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులు వివిధ వసతి గృహాలు, పాఠశాలల్లో రాత్రి బస చేశారు.