పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆరుగురు మంత్రులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఏర్పాట్లను పర్యవేక్షించడానికి పయ్యావుల కేశవ్, సత్య కుమార్ యాదవ్, సవిత, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణరెడ్డి లను ఈ కమిటీలో నియమించారు.