శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, బాధితులకు సత్వరమే న్యాయం జరగాలని అధికారులను ఆదేశించారు. సోమవారం పుట్టపర్తి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి 72 అర్జీలను స్వీకరించారు. ఎస్పీ అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు.