పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి శనివారం 'సుపరిపాలనలో తొలిఅడుగు-ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమంలో భాగంగా కొత్త చెరువులో పర్యటించారు. వార్డుల్లో చిన్నపిల్లలను పలకరిస్తూ వృద్ధుల వద్దకు వెళ్లి కరపత్రాలు ఇచ్చి కూటమి పాలన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కొత్తచెరువుకు చెందిన టీడీపీ నాయకుడు సామకోటి ఆదినారాయణ, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.