రు. 1లక్ష, 51 వేల కోట్లతో భారీ పరిశ్రమలు- పుట్టపర్తి ఎమ్మెల్యే

10చూసినవారు
రు. 1లక్ష, 51 వేల కోట్లతో భారీ పరిశ్రమలు- పుట్టపర్తి ఎమ్మెల్యే
అమడగూరు మండలం పూలకుంట్లపల్లి ఈడిగవారిపల్లిలో బుధవారం రెవిన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. రైతులకు పాసుపుస్తకాలను అందజేశారు. నియోజకవర్గంలో సుమారు రూ. 1 లక్షా 51వేల కోట్ల పెట్టుబడులతో భారీ పరిశ్రమలు స్థాపించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్