
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు.. ముంబైకి మళ్లింపు
హైదరాబాద్లో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం ఉదయం 8.10 గంటలకు శంషాబాద్లో దిగాల్సిన కువైట్ నుంచి హైదరాబాద్కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో, దానిని ముంబైకి మళ్లించారు. ముంబైలో ఇంకా ల్యాండ్ కాని ఈ విమానంలోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటనతో భద్రతాపరమైన ఆందోళనలు నెలకొన్నాయి.




