గురువారం పుట్టపర్తి డీఎస్పీ కార్యాలయాన్ని శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ వార్షిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రికార్డులను పరిశీలించి, నమోదైన కేసుల స్థితిగతులు, పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు, దర్యాప్తులు, వాటి పురోగతిపై కేసుల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పుట్టపర్తి సబ్ డివిజన్ పరిధిలో నేరాల పరిస్థితులపై డీఎస్పీతో ఎస్పీ ఆరా తీశారు. పెండింగ్ కేసులపై దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు కేసులపై సమీక్ష చేయాలని సూచించారు.