
రెండు బస్సులు ఢీ.. ఏడుగురు మృతి!
గుజరాత్లోని సూరత్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్-మహారాష్ట్ర హైవేపై బార్డోలి తహసీల్ పరిధిలో రెండు బస్సులు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయినట్లు సమాచారం. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.




