పుట్టపర్తిలో పిడుగుపాటుతో భారీ అగ్నిప్రమాదం, ప్రజలు భయాందోళన

3514చూసినవారు
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలో గురువారం రాత్రి అకాల వర్షం, ఉరుములు, మెరుపులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. ఎనుములపల్లి గ్రామంలో నారపరెడ్డి ఇంటి వెనుక కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పుట్టపర్తి అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. తృటిలో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్