కొత్తచెరువులో బైండోవర్ ఉల్లంఘనకు పాల్పడిన మురళి, నరసింహ అనే ఇద్దరికి తహశీల్దార్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి రూ. 20,000 చొప్పున జరిమానా విధించినట్లు సీఐ మారుతి శంకర్ తెలిపారు. ఈ మొత్తం చెల్లించడానికి వారికి వారం రోజుల గడువు ఇచ్చారు. గడువులోగా చెల్లించకపోతే రిమాండ్కు తరలిస్తామని హెచ్చరించారు.