పుట్టపర్తి మండలం పెడపల్లి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న మహేష్, రంగాలను కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మహేష్ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, గాయపడిన రంగాను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ధర్మవరం వైపు వెళ్లిపోయిన కారు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.