కళ్యాణదుర్గం మండలం ఎం. వెంకటాంపల్లి గ్రామంలో వీధి కుక్కల గుంపు గొర్రెల మందపై దాడి చేసింది. ఈ ఘటనలో సుమారు 40 గొర్రెలు మృతి చెందగా, మరికొన్ని గాయపడ్డాయి. ఈ దాడి వల్ల లక్షల్లో నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు. పశువైద్యాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.