ధర్మవరం రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలోని కనగానపల్లి మండలం అనంతపురం బెంగళూరు జాతీయ రహదారి పర్వత దేవరపల్లి వద్ద గురువారం లారీ టైరు పేలి దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న లారీకి ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ దుర్ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.