చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామంలో మంగళవారం మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు రాప్తాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షుడు చండ్ర రాయుడు తెలిపారు. అనంతరం, మంగళగిరి నుంచి వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగాన్ని టిడిపి కార్యకర్తలు వీక్షించారు. ఈ కార్యక్రమంలో చండ్రాయుడు, రాము, దాము, శివానంద, మునిరత్నం, మురళీ తదితరులు పాల్గొన్నారు.