శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఎస్బిఐ కాలనీకి చెందిన నాట్య కళాకారిణి మానస, తన శిష్య బృందంతో కలిసి ఇటీవల చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాక వరసిద్ధి దేవాలయంలో 'శ్రీ కాణిపాక విగ్నేశ్వరునికి నృత్య నీరాజనం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు విగ్నేశ్వరునికి చేసిన నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గురువు మానస మాట్లాడుతూ, కాణిపాకంలో ఇలాంటి అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నృత్య కళను విస్తరించడమే తన ధ్యేయమని ఆమె తెలిపారు.