రామగిరి లో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే

6చూసినవారు
రామగిరి లో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అతని అనుచరులు తిరుమల లడ్డూను కూడా కల్తీ చేసి కోట్లు గడించారని రాప్తాడు ఎమ్మెల్యే పరటాల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ కల్తీపై సిట్ సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించిన నేపథ్యంలో, ఆమె రామగిరి మండలం తిరుమల దేవర ఆలయంలో టీడీపీ నాయకులతో కలిసి ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం రూరల్ మండల పరిధిలో కూడా టీడీపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్