రామగిరి మండల కేంద్రంలోని పంచాయతీరాజ్ శాఖ అతిథి గృహంలో, రామగిరి, కనగానపల్లి మండలాలకు చెందిన 10మంది లబ్ధిదారులకు 4.87 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలు, మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.