కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఎమ్మెల్యేలు పరిటాల సునీత, కందికుంట వెంకట ప్రసాద్, ఎంఎస్. రాజు, మంత్రి సవిత, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ హాజరయ్యారు. వీరంతా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవం భక్తులకు కనులవిందుగా నిలిచింది.