రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లి మండలం, దామాజిపల్లి గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకటో తేదీన పెన్షన్లు అందిస్తున్న మనసున్న ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వమే అని ఆమె తెలిపారు.