నవంబర్ 24న ప్రారంభమైన రైతన్నా - మీకోసం కార్యక్రమం ముగింపు సందర్భంగా రాప్తాడు నియోజకవర్గం, ఆత్మకూరు మండలంలోని సనప రైతు భరోసా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు, అధికారులతో కలిసి జరిగిన ఈ సమావేశంలో, ఐదు సూత్రాలతో లాభసాటి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఇంటింటి ప్రచారం పూర్తయినందున, స్థానికంగా రైతులతో రైతు సేవా కేంద్రాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.