రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పుట్టినరోజు సందర్భంగా గురువారం రామగిరి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు, మహిళా నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. పరిటాల సునీత సభ వద్దకు చేరుకోగానే మహిళా నాయకులు పుష్పగుచ్చాలతో ఆమెకు ఘనంగా స్వాగతం పలికి, నీరాజనం పట్టారు.