
ఏపీలో స్క్రబ్ టైఫస్ వ్యాధి.. మహిళ మృతి
ఏపీలో కొత్త రకం వ్యాధి స్క్రబ్ టైఫస్ కలకలం రేపుతోంది. విజయనగరం జిల్లాలో ఈ వ్యాధి లక్షణాలతో ఒక మహిళ మృతి చెందింది. నల్లిని పోలిన కీటకం కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుందని వైద్యులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండగా.. చిత్తూరు, కాకినాడ, విశాఖ జిల్లాల్లో అత్యధికంగా నమోదయ్యాయి. జ్వరం, వాంతులు, అలసట, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.




