పుట్టపర్తి: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి

371చూసినవారు
పుట్టపర్తి: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి
పుట్టపర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా పలువురికి ఆర్థిక సహాయం అందించారు. నల్లమాడ మండలం చారుపల్లికి చెందిన వెంకట రాముడుకు రూ. 85,000, ఓడీసీ మండలం చింతమానుపల్లికి చెందిన పెస్సాని రామచంద్రారెడ్డికి రూ. 62,482, పుట్టపర్తి బ్రాహ్మణపల్లికి చెందిన తలారి పల్లవికి రూ. 40,000, వెంకటగారిపల్లికి చెందిన మందల రామకృష్ణకు రూ. 41,141, సిద్ధారాంపురంకు చెందిన ఓబన్నగారి వెంకట శివయ్యకు రూ. 11,000 విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్