వైసీపీలో నూతన నియామకాలను శనివారం ఆ పార్టీ చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణను వైసీపీ పూర్తి చేసింది. 33 మంది నాయకులను పీఏసీ మెంబర్లుగా నియమించగా, పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు ఉండనున్నారు. పీఏసీ కన్వినర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతలు నిర్వర్తించనున్నారు.