Top 10 viral news 🔥

కాశీబుగ్గ ప్రమాదం.. శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
AP: కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం కోసం ప్రజలు 08942-240557 నంబర్‌కు సంప్రదించాలని జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.




