రోడ్డు ప్రమాదంలో 8 మంది కూలీలకు గాయాలు

5చూసినవారు
రోడ్డు ప్రమాదంలో 8 మంది కూలీలకు గాయాలు
రాయదుర్గం మండలంలోని కెంచానపల్లి సమీపంలో మంగళవారం కూలీలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. మలకాపురం గ్రామానికి చెందిన 12 మంది కూలీలు పని ముగించుకుని ఆటోలో తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మల్లికార్జున, చిట్టి, బేబీ అనే ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు.

సంబంధిత పోస్ట్