రాయదుర్గం పట్టణ శివారులోని హైవే సర్వీసు రోడ్డులో బ్రిడ్జి మలుపు దగ్గర డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో బొమ్మక్కపల్లికి చెందిన మారుతి(28) అనే యువకుడు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో దుర్మరణం చెందాడు. రాయదుర్గం నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు, బంధువులు పెద్దఎత్తున తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు.