అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం చదం గొల్లలదొడ్డి గ్రామంలో 400 కుటుంబాలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. వీరిలో 200 కుటుంబాలు శ్రీఎర్రినాగ ముత్తస్వామిని కొలుస్తాయి. ఈ కుటుంబాల్లో ఆది, సోమవారాల్లో ఆవులు, గేదెల నుంచి పాలు పితకకుండా లేగదూడలకే వదిలేసే విచిత్ర సంప్రదాయం వందేళ్లుగా కొనసాగుతోంది. అలాగే, కంది, ఉలవ, కొర్రలతో వండిన పదార్థాలను నిల్వ చేసుకోవడం కూడా తప్పుగా భావిస్తారు. ఈ ఆంక్షలను ఎవరైనా ధిక్కరిస్తే, ఏడాదికోసారి జరిగే ఆవుల దేవర పండగనాడు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుంది.