
మగాళ్ల మానసిక ఆరోగ్యంపై చర్చ!
కొత్త సంవత్సరానికి అడుగుపెడుతున్న వేళ పురుషుల మానసిక ఆరోగ్యంపై చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘మగాడు ఏడవకూడదు’ అనే సామాజిక భావనతో చాలా మంది భావోద్వేగాలను దాచుకుంటున్నారు. ఉద్యోగ, కుటుంబ, ఆర్థిక ఒత్తిళ్లు, ఒంటరితనం మానసిక కుంగుబాటుకు దారితీస్తున్నాయి. పురుషుల్లో ఆత్మహత్యలు పెరుగుతుండటం ఆందోళనకరం. మగాడు కూడా భావోద్వేగాలు కలిగిన మనిషేనని గుర్తించి, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం, కుటుంబం–స్నేహితులతో మనసు విప్పి మాట్లాడటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.




