డి.హీరేహాళ్ మండలం జాజరకల్లుకు చెందిన నలుగురు మైనర్ లు శనివారం తెల్లవారుజామున ఇంటినుంచి వెళ్లిపోయారు. తల్లితండ్రులు వారిని మందలించారని ఇంటి నుంచి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు తల్లిదండ్రులు ఎస్సై గురుప్రసాద్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ వెంకట రమణ ఆధ్వర్యంలో గాలింపు
చేపట్టారు. పిల్లలు కర్ణాటక రాష్ట్రం ఉలిగిలో ఉన్నట్లు గుర్తించి తల్లితండ్రులకు అప్పగించారు.