రాయదుర్గం పట్టణ శివారులో కుక్కల దాడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఓ ఆడ నెమలిని స్థానికులు రక్షించారు. అనంతరం రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. సమాచారం అందుకున్న డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ అధికారి దామోదర రెడ్డి ఆదేశాలతో అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని నెమలిని స్వాధీనం చేసుకున్నారు. దాని ఆరోగ్యం పరీక్షించిన అనంతరం సురక్షిత అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.