బొమ్మనహాళ్ మండలంలోని ఉప్పరహాళ్, శ్రీధరఘట్ట గ్రామాల మధ్య నాలుగు కిలోమీటర్ల రహదారి గుంతలు, రాళ్లతో నిండిపోయి ప్రయాణానికి వీలులేకుండా మారింది. ఈ మార్గంలో వెళ్లే ద్విచక్రవాహనదారులు తరచుగా కిందపడి గాయాలపాలవుతున్నారు. పంటల తరలింపు సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డును బాగు చేయాలని పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పాలకులు, అధికారులు వెంటనే స్పందించి రహదారిని బాగుచేయాలని వారు కోరుతున్నారు.