రాయదుర్గం పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను క్రమబద్ధీకరించేందుకు ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ పనులు చేపట్టనున్నట్లు విప్ కాలవ శ్రీనివాసులు తెలిపారు. శనివారం ఆయన రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ పనులకు భూమిపూజ చేశారు. ఈ విస్తరణలో భాగంగా కొత్త ప్లాట్ఫారాలు నిర్మించడంతో పాటు, దెబ్బతిన్న బస్టాండ్ భవనాన్ని పునఃనిర్మిస్తామని, ప్రస్తుతం పాత బస్టాండ్ నుండి నడుస్తున్న బస్సులన్నీ ఇక్కడి నుండే బయలుదేరేలా ఏర్పాట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు.