రాయదుర్గం మండలం ఉడేగోళం గ్రామానికి చెందిన కౌలు రైతు తిప్పేస్వామి, అప్పుల భారంతో మనస్తాపం చెంది గత నెల 29న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.