ట్రాఫిక్ నియమాలు పాటించండి: ప్రజలకు ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి సూచన

3921చూసినవారు
ట్రాఫిక్ నియమాలు పాటించండి: ప్రజలకు ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి సూచన
డి హిరేహాల్ మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ లో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి ప్రజలకు సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది ప్రాణ రక్షణకు అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ వాడకాన్ని మానుకోవాలని, ప్రజలందరూ రోడ్డు భద్రతను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్