
తండ్రి, మేనమామ లైంగిక దాడి.. గర్భం దాల్చిన బాలిక
AP: అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికపై కన్నతండ్రి, మేనమామ లైంగిక దాడికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. బాలిక అనారోగ్యంతో బాధపడుతుండటంతో అనుమానం వచ్చిన ఉపాధ్యాయురాలు చికిత్స చేయించగా అసలు విషయం బయటపడింది. సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు తండ్రి, మేనమామ లైంగిక దాడికి పాల్పడ్డారని బాలిక ఉపాధ్యాయులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




