ప్రమాదవశాత్తు నీటి లో మునిగి వ్యక్తి మృతి

6చూసినవారు
ప్రమాదవశాత్తు నీటి లో మునిగి వ్యక్తి మృతి
డి. హిరేహాళ్ మండలం బాదనహాల్ రైల్వే స్టేషన్ సమీపంలోని నీటి కుంటలో ఈతకు వెళ్లి హంపన్న అనే వ్యక్తి మృతి చెందాడు. కర్ణాటక రాష్ట్రం నాగసముద్రం గ్రామానికి చెందిన ఇతడు కల్యం గ్రామంలో శుభకార్యానికి కుటుంబంతో కలిసి వచ్చాడు. మంగళవారం బంధువులతో ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్