అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

11చూసినవారు
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
గుమ్మగట్ట మండలం రంగసముద్రం గ్రామంలో ఆదివారం ఆవులు మేపడానికి వెళ్లిన బోయ మారెన్న అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన మారెన్న సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడి కోసం పొలాల్లో వెతికారు. కంపచెట్ల మధ్య పడి ఉన్న మారెన్నను గుర్తించి, వెంటనే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్