కనేకల్ మండల కేంద్రంలో శనివారం రాత్రి పెట్రోల్ నిల్వలు అయిపోతాయనే పుకార్లు సామాజిక మాధ్యమాల్లో రావడంతో, వాహనదారులు పెట్రోల్ కోసం బంకుల వద్దకు భారీగా తరలివచ్చారు. సరఫరా నిలిచిపోతుందన్న భయంతో కొందరు క్యాన్లలో కూడా పెట్రోల్ నింపుకున్నారు. అయితే, ఇవన్నీ కేవలం పుకార్లేనని, పెట్రోల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని బంకు నిర్వాహకులు స్పష్టం చేశారు. వాహనదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు సూచించారు.