మైనింగ్ ప్రాంతాల్లో డ్రోన్ సర్వే నిర్వహించిన అధికారులు

2చూసినవారు
మైనింగ్ ప్రాంతాల్లో డ్రోన్ సర్వే నిర్వహించిన అధికారులు
సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ మంగళవారం డి. హీరేహాళ్ మండలం మల్లప్పనగుడి గ్రామం సమీపంలో ఓఎంసీ మైనింగ్ కంపెనీ పరిధిలోని సుమారు 100 ఎకరాలకు పైగా మైనింగ్ ప్రాంతాలలో సర్వే చేపట్టింది. రెవెన్యూ, అటవీశాఖ, మైనింగ్ ఇతర శాఖల అధికారులు డ్రోన్ పాయింట్ల ద్వారా మైనింగ్ కంపెనీల సరిహద్దులను గుర్తించారు. ఈ సర్వే ప్రక్రియ మరో వారం రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్