రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్లు ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. శనివారం కణేకల్లు పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గం అర్బన్ సీఐ జయనాయక్ కూడా రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ నుంచి లక్ష్మీబజార్, పాతబస్టాండ్ మీదుగా వినాయకసర్కిల్ వరకు ద్విచక్రవాహన ర్యాలీ జరిగింది.