ఉపాధి హామీని కాపాడుకోండి: గౌనీ ప్రతాప్ రెడ్డి పిలుపు

1చూసినవారు
రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌనీ ప్రతాప్ రెడ్డి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పరిరక్షణకు ఫిబ్రవరి 2న బండ్లపల్లి గ్రామం, 3న కళ్యాణదుర్గం పట్టణంలో వైఎస్ షర్మిలమ్మ చేపడుతున్న ప్రజా ఉద్యమాలకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. గత 20 ఏళ్లుగా కరువు, వలసలతో బాధపడుతున్న ప్రజలకు అండగా నిలిచిన ఈ పథకం పేరు మార్చి, 100 రోజుల పని హక్కును కాలరాసే కేంద్ర ప్రభుత్వ ఆలోచనలను వ్యతిరేకించాలని, పథకాన్ని పటిష్ఠం చేయాలని ఆయన కోరారు. ప్రతాప్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో ప్రెస్ నోట్ ద్వారా ఈ విషయాలు తెలిపారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని, కేంద్రం నిధులు తగ్గించడం పేదల సంజీవిని నీరుగార్చే చర్య అని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్