రాయదుర్గం: అనుకోకుండా బైక్ లో మంటలు- తప్పిన పెను ప్రమాదం

14చూసినవారు
రాయదుర్గం: అనుకోకుండా బైక్ లో మంటలు- తప్పిన పెను ప్రమాదం
బొమ్మనహళ్ మండల కేంద్రంలోని కళ్యాణదుర్గం-బళ్లారి రహదారిపై సోమవారం సాయంత్రం బైక్ అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయింది. ఉంతకల్లు గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి సరిహద్దులోని బంక్ లో పెట్రోల్ వేయించుకుని సొంతూరికి వస్తుండగా, చెక్ పోస్టు సమీపంలో బైక్ ఇంజిన్ నుంచి పొగ రావడంతో వెంటనే ఆపి దిగిపోయాడు. క్షణాల్లోనే మంటలు చెలరేగి బైక్ బూడిదైంది.

ట్యాగ్స్ :