కణేకల్లు మండలంలోని సొల్లాపురం గ్రామంలో కొత్తగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి గురువారం ప్రారంభించారు. ప్రభుత్వం సరఫరా చేసే గుడ్లు, రేషన్ నాణ్యతగా లేకపోతే వాటిని తిరస్కరించాలని అంగన్వాడీలకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ నాగమణి, టీడీపీ నాయకులు కేశప్ప, వేణుగోపాల్, సాయిప్రసాద్, రామ్మోహన్, ప్రసాద్, గోవిందరాజులు, సత్తర్ పాల్గొన్నారు.