రాయదుర్గం కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గణితశాస్త్రం బోధించడానికి అతిథి అధ్యాపక పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. ఎమ్మెస్సీ మ్యాథ్యమెటిక్స్ లో 55% మార్కులతో పాటు సెట్/నెట్/పీహెచ్‌డీ అర్హత కలిగిన వారు శనివారం ఉదయం 10 గంటలకు కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి.