రాయదుర్గం: చేతివాటం ప్రదర్శించిన బేకరీల యజమానులకు జరిమానా

3చూసినవారు
రాయదుర్గం: చేతివాటం ప్రదర్శించిన బేకరీల యజమానులకు జరిమానా
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లాలోని పలు బేకరీ షాపుల్లో తూకాల్లో మోసం జరిగినట్లు లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శంకర్ బుధవారం తనిఖీల్లో గుర్తించారు. కణేకల్, ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లోని బేకరీల్లో 1 కిలో కేక్ కు 200 గ్రాములు తక్కువ తూకం వేస్తున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో కణేకల్లులో 2 షాపులకు రూ. 20 వేలు, ఉరవకొండలో 4 షాపులకు రూ. 41 వేలు, విడపనకల్లులో 3 షాపులకు రూ. 27 వేల చొప్పున మొత్తం రూ. 88 వేల జరిమానా విధించారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్