రాయదుర్గం: రోడ్డుపై ఎలుగుబంటి సంచారం

16చూసినవారు
రాయదుర్గం టౌన్ ముత్తరాసి కాలనీ సమీపంలోని బైపాస్ రోడ్డుపై ఎలుగుబంటి తిరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. పట్టపగలు కొండ దిగివచ్చి రోడ్డుపైకి రావడంతో వాహనదారులు, పక్క పొలాల్లో పనిచేసే రైతులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా ఎలుగుబంటి కదలికలను కొందరు దగ్గర నుంచి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫారెస్టు అధికారులను ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్