రాయదుర్గం: వ్యక్తి అదృశ్యం కేసు నమోదు

11చూసినవారు
రాయదుర్గం: వ్యక్తి అదృశ్యం కేసు నమోదు
గుమ్మఘట్ట మండలంలోని నేత్రపల్లిలో మంగళవారం సాయంత్రం వ్యవసాయ పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి రాని కావలి మనోహర అనే యువకుడి అదృశ్యంపై బుధవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. యువకుడి తండ్రి, మాజీ సర్పంచ్ హనుమప్ప ఫిర్యాదులో, తమ కుమారుడికి గ్రామంలో ఎవరితోనూ కక్షలు లేవని, స్నేహితులతో ఉన్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని గొర్రెల కాపరుల ద్వారా సమాచారం అందినట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్