రాయదుర్గం పట్టణంలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రహరీ, ఇతర అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విజయవాడలో శుక్రవారం దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు వస్తారని, వారి సౌకర్యార్థం పెండింగ్ పనులను వెంటనే చేపట్టాలని ఆయన కోరారు.