రాయదుర్గం: అభివృద్ధికి సహకరించండి: విప్ కాలవ శ్రీనివాసులు

11చూసినవారు
రాయదుర్గం: అభివృద్ధికి సహకరించండి: విప్ కాలవ శ్రీనివాసులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి పనులతో ప్రపంచం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని, రాబోయే స్థానిక ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కోరారు. గురువారం డి. హీరేహాళ్ మండలంలోని లింగమనహళ్లిలో ఆయన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతరెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగళ్లి రాజు, మండల కన్వీనర్ మోహన్ రెడ్డి, ఎంపీడీఓ దాసనాయక్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్